Dear readers please note that the numbers given before the message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram
English:
13. Baba-''Even though I am fakir and don’t have a wife, house, children and sit in one place, I am still suffering from a kind of pain (maya). I forget myself but am unable to forget maya. It is always with me. Only when you pray to Hari will you be free from it as only when Hari is happy with you can the pain of maya go away. It is the only way to be free of the maya.''
Baba-''Those who are lucky and those whose evil deeds are lessened, those who believe in me and do bhajans can know Me. Those who always say “Sai Sai “will fly over seven seas. Trust in my words and you will have good things blessed upon you. I don’t need worship, pooja or eight kinds of yogas. Where there is belief, I am there for you.''
Baba-''Whatever bad times you are going through, when you climb the steps of this Masjid, they go away and you will find happiness. The fakir here is very kind hearted. He will take away their diseases. This fakir will protect you with his love and kindness.” Allah will always protect you.''
14.''I know that you don’t have wealth. But you give me an offering from your knowledge of Yogavashishtanam. My property is only a piece of cloth, a glass etc. But still devotees give Me is of no use to me.''
15.Baba-''why do I need a coat, towel, a cap for decorating me?
Just spread your hands in front of me with devotion and I will always be with you. Even if my body is here, I still know what you are doing on the other side of seven seas. You go wherever you like I am still there with you. My place is always in your heart. I am in your body. Always pray to Me, as am I in your heart as well as in the hearts of other people. Those who recognise Me in others are lucky, kind and virtuous.''
16&17. Baba ”I only give out wealth but don’t have any interest in loaning. Many people come to me and ask for wealth, health, fame, respect, jobs, cures which are present only on the earth. But very few people come to me and ask for universal knowledge Everyone asks for worldly pleasures and there is no dearth of them. Those who think about after life are very few.”
''To look at the depth of the universe we need to give away 5 things:
1.five pranas. 2.five senses. 3.mind, 4.knowledge and 5.arrogance.
The path to attain knowledge of the universe and the soul is really very difficult just like the edge of a sharp knife.''
Telugu:
13 ."నేను ఫకీరునయినప్పటికీ, ఇల్లు,వాకిలి,భార్యాబిడ్డలు,తదితర బాదరబందీలేవీలేకుండా,ఎక్కడికీ కదలక యొకచోట కూర్చునియున్నప్పటికీ,తప్పించుకోలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్నావరించుచున్నది.హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా,నావంటి దుర్బలుడైన ఫకీరనగ నెంత? హరి ప్రసన్నుడైనపుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం."
"ఎవరు అదృష్టవంతులో యెవరి పాపములు క్షీణించినవో,వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెఱుగ గలరు.ఎల్లప్పుడు'సాయి సాయి' అని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదను. ఈ
మాటలను విశ్వశింపుము.తప్పక మేలు పొందెదవు.పూజా తంతుతో నాకు పని లేదు. షోడషోపచారములు గాని,అష్టాంగయోగములు గాని,నాకు అవసరము లేదు.భక్తి యున్నచోటనే నా నివాసము."
“ఎంతటి పీడ,బాధలున్నవారైనను ఎప్పుడైతే యీ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు
నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు.వారి రోగమును తప్పక బాగుచేయును. ఆ ఫకీరు అందని ప్రేమతోను,దయతోను కాపాడును.”
''అల్లా అచ్ఛా కరేగా"
14."నీ వద్ద ధనము లేదని నాకు తెలియును.కానీ నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు కదా? దానినుంచి నాకు దక్షిణ యిమ్ము."
“నా యాస్తి యంతయు నొక కౌపీనము,ఒక విడి గుడ్డ,ఒక కఫినీ,ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే. అయినప్పటికి భక్తులనవసరమైన,నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారు."
15.“శరీరముపై కోటు,కండువా,టోపీ మొదలయిన అలంకారాలన్నీ ఎందుకు?"
“నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నే నుండెదను. నా దేహము ఇచ్చట నున్నప్పటికీ,సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు.నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు.నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను,సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు.
ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు,పావనులు,అదృష్టవంతులు. ''
16 &17."నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు.అనేకమంది నా వద్దకు వచ్చి ధనము,ఆరోగ్యము,పలుకుబడి, గౌరవము,ఉద్యోగము,రోగనివారణము మొదలగు ప్రాపంచికవిషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మఙ్ఙానమునివ్వుమని అడుగువారు చాల తక్కువ.ప్రపంచ విషయములు కావలెనని అడుగువారికి లోటు లేనేలేదు.
పారమార్ధిక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు.”
" బ్రహ్మమునుజూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను.అవి యేవన:-
1) పంచప్రాణములు,2) పంచేంద్రియములు,3) మనస్సు,4) బుద్ధి,5) అహంకారము.
బ్రహ్మఙ్ఙానము లేదా ఆత్మసాక్షాత్కారము బోవు దారి చాలా కఠినమయినది.అది కత్తివాదరవలె పదునైనది.
బ్రహ్మజ్ఙానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత పై బాబా ఇచ్చిన ప్రసంగము 128 పేజీ నుండి 131 వ పేజీ వరకు ఉ న్నది .అది ఇక్కడ ఇచ్చుట లేదు.ఆ ప్రసంగము విడిగా చెప్పుకుందాము.
Devotees who wish to read the earlier posted post message and have missed can read by clicking in links given below.
Loading
<>
If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!
0 comments:
Have any question? Feel free to ask.