Essence of Shri Sai Satcharitra is being liked by many devotees and they have sent their thanks to Rama Rao ji for contributing this to blog .Dear readers please note that the numbers given before the message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram
English .---------------------------------------------------------------------------
7.Baba"See how I feel sorry for the devotees. All their difficulties are mine.”
8. Baba “A Fakir is wealthier than a real king as he is forever the same whereas wealth can vanish in few minutes.”
9. Baba told Tharkhad’s wife who fed a hungry dog with a piece of bread “ It will always be in your goodwill that you fed Me with food till my stomach full. ” I am still burping after eating the food you gave me. I am very satisfied. Keep doing this always. Sitting in this Masjid, I don’t lie. Always be kind to Me . Do remember to feed any hungry living being before you eat. The dog you fed before you ate and Me are the same. In the same way cats, pigs, cows etc. are all roam me. I am roaming in their forms. Those who see me in them are my real devotees. So leave aside the feelings of making me separate from them and serve every living thing the way you will serve me.
10. The meaning of Baba's saying:
“ Lord Shriram-the Hindus God and Allah- the God of Muslims are one and the same. Then why you people who are their devotees are fighting among yourselves. You foolish people join your hands and live in harmony. Behave wisely. There is no advantage with fights and arguments to achieve national integration, leave them. Don’t compete with anyone and look after your well being and advance in life. God will always protect you. Meditation, Sacrifice, knowledge are the ways to attain salvation. Even if anyone does bad things to you don’t retaliate the same way. If you want to do something to others always do good to them.”“keep your knowledge aside and always remember to say “Sai Sai” to attain salvation and to be free from everything.”
11.&12. Baba "I don’t remember being angry at any one. Does a mother ever make her children go away? Does an ocean turn away the river which comes to join in it? Why would I ill-treat you? I am here to serve you. I always wish for your well being. I am always beside you and when you call I speak. I only want your love.”
Telugu:
7. ''నా భక్తులకొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము!!వారి కష్టములన్నియు నావే!!''
8 ''ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవియనీ, అదియే శాశ్వతమని,మామూలు సిరిసంపదలు క్షణభంగురాలని'' బాబా అనుచుండెడి వారు
9 . ఆకలితో ఉన్న కుక్కకు రొట్టెముక్క వేసిన తర్ఖడ్ భార్యతో బాబా"''తల్లీ నాకు కడుపునిండా గొంతువరకు భొజనము పెట్టినావు.నా జీవశక్తులు సంతుష్టి చెందినవి.ఎల్లప్పుడును ఇట్లనే చేయుము.ఇది నీకు సద్గతి కలుగజేయును.
ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడు అసత్యమాడను.నాయందిట్లే దయయుంచుము.మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము.దీనిని జాగ్రత్తగా జ్ఙప్తియందుంచుకొనుము.”'' బాబా"నీవు ప్రేమపూర్వకముగ పెట్టిన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే.అట్లనే,పిల్లులు,పందులు,ఈ
గలు,ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే.నేనే వారి యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు.కావున నేను వేరు తక్కిన జీవరాశి యంతయు వేరుయను ద్వందభావమును విడిచి నన్ను సేవింపుము."
10 సంగ్రహముగా బాబా యొక్క ప్రబోధము------
“హిందువుల దైవమగు శ్రీరాముడును,మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువుల మధ్య యేమీ భేదములేదు.అట్లయినపుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు?ఓ అఙ్ఙానులారా ! చేతులు చేతులు కలిపి రెండు జాతులును కలిసి మెలసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు.జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు.వివాదము వల్లగాని,ఘర్షణ వల్లగాని ప్రయోజనము లేదు.అందుచే వివాదమును విడువుడు.ఇతరులతో పోటీ పడకుడు.మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్మురక్షించును. యోగము,త్యాగము, తపస్సు,ఙ్ఙానము మోక్షమునకు మార్గములు.వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాంచనిచో మీ జీవితము వ్యర్ధము. ఎవరైన మీకు కీడు చేసినచో,ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో ఎల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు.'''' --------- ఇదియే ఇహపర సాధనము.
బాబా---“”తెలివితేటలను ప్రక్కకు బెట్టి 'సాయి సాయి' అను నామమును మాత్రము ఙ్ఙప్తియందుంచుకొనుమనిరి.
అట్లు చేసినచో వారు సర్వబంధములనుండి విముక్తులై,స్వాతంత్ర్యము పొందెదరు"" ----అని చెప్పిరి.
11 & 12.
”నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను.తల్లి తనబిడ్డలనెక్కడైనా తరిమివేయునా?సముద్రము తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా? నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను?నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను.నేనెప్పుడూ మీ వెంటనే యుండి,పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు
కోరేది మీప్రేమను మాత్రమే.""
Devotees who wish to read the earlier posted post message and have missed can read by clicking in links given below.
© Shirdi Sai Baba Sai Babas Devotees Experiences Sai Baba Related all Details
Loading
<>
If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!
0 comments:
Have any question? Feel free to ask.